Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్తకు తలాక్ చెప్పి.. మేనల్లుడితో ముగ్గురు పిల్లల తల్లి జంప్!

  • పెళ్లి అయిన దగ్గరి నుంచి ఒకటే హింస
  • ఇక భరించలేను.. తలాక్
  • భర్తకు లేఖ రాసిన భార్య
సీన్ రివర్స్ అయింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన భర్తకు ముమ్మారు తలాక్ చెప్పి ప్రియుడితో కలిసి వెళ్లిపోయి షాకిచ్చింది. హరియాణాలోని ఉనేడి గ్రామంలో జరిగిందీ ఘటన. ఓ పేపర్‌పై మూడుసార్లు తలాక్ అని రాసి మేనల్లుడితో ఆమె వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.

భర్తకు రాసిన లేఖలో మహిళ షాజియా ‘‘నేను నా ఇష్టపూర్వకంగా తలాక్ చెబుతున్నా. వివాహం అయినప్పటి నుంచి నువ్వు నన్ను హింసిస్తూనే ఉన్నావు. అందుకే వెళ్లిపోతున్నా. తాగి వచ్చిన ప్రతిసారి నన్ను కొడుతున్నావు. ఇక భరించడం నా వల్ల కాదు. నీకు తలాక్ చెబుతున్నా’’ అని అందులో పేర్కొంది. తలాక్ విషయంలో తనపై ఎవరి ఒత్తిడీ లేదని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని షాజియా పేర్కొంది. భర్తకు తలాక్ చెప్పిన ఆమె అవివాహితుడైన తన మేనల్లుడితో వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Talaq
Muslim
Woman
Haryana
India
elope

More Telugu News